![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -460 లో....బావకి తన ప్రాణధాత గురించి తెలియడమేంటి.. అసలు నాకేం అర్థం అవడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని టెన్షన్ పడుతుంటే అప్పుడే దాస్ ఫోన్ చేసి.. నీ తమ్ముడు ఎవరికో ఆక్సిడెంట్ చేసాడు.. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.. నువ్వే కాపాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. సరే నాన్న అని జ్యోత్స్న అంటుంది.
అప్పుడు పెళ్లి అపురా అంటే చివరి నిమిషంలో ఆ కాశీ గాడు హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు కూడా అంతే నేను హెల్ప్ చేస్తానని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తానని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. గ్రానీ మనల్ని మోసం చేసిన వాళ్ళని మోసం చెయ్యడం కరెక్టే కదా అని అడుగుతుంది. కరెక్టే అని పారిజాతం అంటుంది. నీ మనవడికి ఇలా జరిగిందని చెప్తే గుండెపట్టుకుంటావ్ కానీ చెప్పనని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్య బర్త్ డే.. అందరు బర్త్ డే అని మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తారు. శౌర్య గుర్తు చెయ్యగానే అందరు విష్ చేసి మాకు ముందే తెలుసని అంటారు.
ఆ తర్వాత దశరథ్ పొరపాటుగా సుమిత్ర అని అంటాడు. మళ్ళీ ఆగిపోతాడు. మీరు కావాలని పిలిచారని సుమిత్ర అంటుంది. సారీ అని దశరథ్ అనగానే నన్ను క్షమించండి నేను ఇలా ఉండలేను.. నాతో మాట్లాడండి అని సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. అది నేను కాదు నా చెల్లి చేయ్యాలని దశరథ్ అంటాడు. శివన్నారాయణ అదంతా విని దశరథ్ పై కోప్పడతాడు. ఆడపిల్ల బాధపడితే ఈ ఇంటికి అరిష్టం అలాంటిది కాంచన బాధకి కారణమయ్యావని దశరథ్ అంటాడు. మరొకవైపు అమ్మ.. నేను ఈ రోజు మీతో వస్తానని శౌర్య అంటుంది. కానీ నువ్వు నీ బర్త్ డే అని ఎవరికి చెప్పొద్దూ.. అలా అయితేనే రా అని దీప అనగానే శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |